రోజూవారి జీవితాల ప్రదర్శన..ఇది ఓ అద్బుత ప్రయోగం

updated: March 14, 2018 21:09 IST
రోజూవారి జీవితాల ప్రదర్శన..ఇది ఓ అద్బుత ప్రయోగం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో హైదరాబాద్‌లోని సామాన్యశాస్త్రం గ్యాలరీలో  రోజువారీ జీవితాలను ప్రదర్శనకు పెట్టారు. Everyday Women పేరిట జరిగే ఈ ఛాయాచిత్ర ప్రదర్శన. మార్చి 6 సాయంత్రం 6 గం॥లకు మామిడి హరికృష్ణ ప్రారంభించారు. నెలరోజుల పాటు జరిగే ఈ ప్రదర్శన జరుగుతుంది. ప్రవేశం ఉచితం. ఇందులో ప్రదర్శించే ఛాయాచిత్రాలను కందుకూరి రమేష్ బాబు తీయటం జరిగింది. వచ్చి చూసిన వారంతా అద్బుతం అని ప్రశంశిస్తున్నారు. 


సహజత్వాన్ని ఒక ఫ్రేమ్‌లో బంధించి కళ్లదుట ఓ  దృశ్యాన్ని ఆవిష్కరించి హృదయంతో చూసేలా చేయగలుగుతున్నారు. ఇలాంటి దృశ్యాలని వెతికిపట్టి బంధించాలంటే హృదయ సంచారం అవసరం. కందుకూరి రమేష్ బాబులో ఈ విశిష్ట లక్షణాలన్ని ఉన్నాయి కాబట్టే ఆయన ఫోటోగ్రఫీ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది.
ఫొటోగ్రాఫర్, కవి, సీనియెర్ పాత్రికేయుడు కందుకూరి రమేష్ బాబు దాదాపు పదేళ్లుగా  తెలుగు సాహిత్యంలో ఒక కొత్త ద్వారాన్ని తెరిచారు. ‘సామాన్య శాస్త్రం’ పేరుతో సామాన్యుల జీవితాలను పరిచయం చేస్తున్నారు. అది చదివి న వారికి గొప్ప ఉత్సాహం ప్రేరణా కలిగిస్తున్నారు. గొప్ప వ్యక్తుల గురించి చెప్పటం ఎవరికైనా చాలా సులభం. కానీ, సామాన్య వ్యక్తుల గురించి, అదీ చదివించే శైలిలో రాయటం సామాన్య విషయం కాదనేది వాస్తవం. అందరి చేతా చదివించే గుణం ఆయన శైలిలో ఉంది. అదే ఒరవడి ఆయన ఐదేళ్ళుగా ఫోతోగ్రఫీలోకి కూడా తెచ్చారు. తాను తీసే ఛాయా చిత్రాలతో దైనందిన  జీవితపు మహత్యాన్ని సహజ సుందరంగా ఆవిష్కరిస్తున్నారు. ప్రస్తుతం సామాన్యశాస్త్రం గ్యాలరీలో పెట్టిన రోజువారీ స్త్రీల ప్రదర్శన అందుకు మరో నిదర్శనం

 

comments